రంగారెడ్డి: రూ. 78,59,775 ఫెనాల్టీ.. అధికారుల తీరుతో ప్రభుత్వ ఆదాయానికి గండి

0చూసినవారు
రంగారెడ్డి: రూ. 78,59,775 ఫెనాల్టీ.. అధికారుల తీరుతో ప్రభుత్వ ఆదాయానికి గండి
రంగారెడ్డి జిల్లా మైనింగ్​ ఏడీ, నమిశ్రీ ఇన్​ఫ్రాస్ట్రక్షర్​ అండ్​ ప్రాజెక్ట్స్​ ప్రైవేట్​ లిమిటెడ్​ నిర్మాణ సంస్థకు అనుమతులకు మించి మట్టి తవ్వకాలు జరిపినందుకు రూ. 78,59,775 జరిమానా విధించింది. సరూర్​నగర్​ మండలం, మన్సూరాబాద్​ రెవెన్యూ పరిధిలో ఈ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేయడంతో, 2024 జూన్​ 21న పరిశీలించి ఆగస్టులో జరిమానా విధించారు. అయితే, రెండేళ్లు గడుస్తున్నా జరిమానా వసూలు చేయడంలో మైనింగ్​ శాఖ విఫలమైంది. ఈలోగా, సంస్థపై అక్రమ గ్రావెలింగ్​తో పాటు టీపీ లేకుండానే మట్టిని బహిరంగంగా అమ్ముకుంటున్నారని ఆరోపణలున్నాయి. స్థానికులు మళ్లీ ఫిర్యాదు చేయడంతో, అక్టోబర్​ 25న జీహెచ్​ఎంసీ, తహసీల్దార్​, ఎస్​హెచ్​వోలకు చర్యలకై లేఖలు రాసినా, అధికారులు ముడుపులు అందుకుని ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.