రంగారెడ్డి జిల్లాలో ప్రేమ, పెళ్లి పేరుతో బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడిన నిందితుడు సాదంగి వెంకటేశ్ (30)కు న్యాయస్థానం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.20వేల జరిమానా విధించింది. 2020లో 16 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అపహరించి, జడ్చర్లలో బంధించి అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. బాధితురాలు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు అనంతరం కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి పద్మావతి సోమవారం ఈ తీర్పునిచ్చారు. బాధితురాలికి రూ. లక్ష నష్టపరిహారం కూడా మంజూరు చేశారు.