హయత్ నగర్ లో కలకలం.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యం

5చూసినవారు
హయత్ నగర్ లో కలకలం.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యం
హయత్ నగర్ పోలీసు ఠాణా పరిధిలో ఒక తల్లి తన ఇద్దరు పిల్లలతో సహా అదృశ్యమైన సంఘటన చోటుచేసుకుంది. హయత్ నగర్ లోని ఒక కాలనీలో నివసిస్తున్న ఈమె, గత నెల 30న ఉదయం తన ఇద్దరు కుమారులను పాఠశాల మీటింగ్ కు వెళుతున్నానని చెప్పి తీసుకెళ్లింది. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించినా ఆచూకీ లభించలేదు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది.

సంబంధిత పోస్ట్