వార్డు సభ్యుల హక్కుల కోసం ఐక్యంగా కృషి చేయాలి

701చూసినవారు
వార్డు సభ్యుల హక్కుల కోసం ఐక్యంగా కృషి చేయాలి
హైదరాబాద్‌లో తెలంగాణ వార్డ్ మెంబర్ ఫోరం ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షురాలు నాగబెల్లి జ్యోతి పలువురు బాధ్యులకు నియామక పత్రాలు అందజేసి సన్మానించారు. గద్వాల్ జిల్లా ఇంచార్జిగా సేలే రవి బోయ, జిల్లా కో-ఇంచార్జిగా వడ్డే ఉరుకుందు, షాద్‌నగర్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కారే శ్రీకాంత్ యాదవ్, నందిగామ మండల అధ్యక్షుడిగా శివగల సురేష్ బాధ్యతలు స్వీకరించారు. వార్డు సభ్యుల హక్కుల కోసం ఐక్యంగా కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర లీగల్ సెల్ ప్రతినిధి అందే రవి, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గనగాని రమేష్ గౌడ్, రాష్ట్ర సోషల్ మీడియా ఇంచార్జి శ్రీరంగం సాగర్, వరంగల్ జిల్లా ఇంచార్జి రామరపు శిరీష, రంగారెడ్డి జిల్లా ఇంచార్జి సురేష్, కో-ఇంచార్జి మల్లేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్