మహేశ్వరం - Maheshwaram

రోడ్ల దుస్థితిపై బీజేపీ నిరసన

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోడ్ల అధ్వాన స్థితిపై బీజేపీ నాయకులు గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందేల శ్రీరాములు యాదవ్ ఆధ్వర్యంలో నాదర్గుల్‌లోని రేడియల్ రోడ్ నం. 26 పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి & బడంగ్పేట్ కమిషనర్ సరస్వతి రోడ్ల పరిస్థితిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇటీవల చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తరహా ఘటన బడంగ్పేట్‌లో పునరావృతం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ నిరసన చేపట్టామని తెలిపారు.

వీడియోలు


రంగారెడ్డి జిల్లా