తిరుమల నగర్ కాలనీలో అష్ట గణపతులకు ఘనంగా అభిషేకం

548చూసినవారు
జిల్లెల్‌ గూడలోని తిరుమల నగర్ కాలనీ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద శనివారం సాయంత్రం అష్ట గణపతులకు ప్రత్యేక అభిషేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కోయంబత్తూరు నుంచి తెప్పించిన అష్ట గణపతులకు, దేశవ్యాప్తంగా 11 పుణ్య నదుల నుంచి సేకరించిన జలాలతో వైభవంగా పూజలు చేశారు.
శ్రీశైలం వీరశైవ గురుకులానికి చెందిన వేద పండితుల మంత్రోచ్ఛారణలు, శాస్త్రోక్త విధివిధానాల నడుమ ఈ కార్యక్రమం సాగింది. ఈ విశేష పూజలో కాలనీవాసులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అనిల్ యాదవ్, ప్రముఖ సింగర్ శ్రీరామచంద్ర పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్