రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ కొప్పిశెట్టి కిరణ్మయి, నీటి సంరక్షణకు ముందస్తు చర్యలు చేపట్టాలని, పెండింగ్ అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. శనివారం కడ్తాల్ మండలంలో నిర్వహించిన డివిజన్ స్థాయి సమీక్షలో మాట్లాడుతూ గ్రామాల్లో నీటి వనరుల సంరక్షణ, వర్షపు నీటి నిల్వకు చర్యలు చేపట్టాలని, వీబీజీ రామ్ పనులు, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.