జలసిరి పథకంపై అవగాహన సమావేశాలు

1చూసినవారు
జలసిరి పథకంపై అవగాహన సమావేశాలు
తలకొండపల్లి మండలం పడకల్ గ్రామంలో వీబీజీరామ్ కార్యక్రమంలో బాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ మ్యాప్ ను రూపొందించారు. గ్రామంలోని అభివృద్ధి పనులు, వనరులు, ఉపాధి హామీ పనుల ప్రణాళికకు ఉపయోగపడేలా దాన్ని రూపొందించినట్లు అధికారులు తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ డోకూరు సునిత ప్రభాకర్రెడ్డి స్థానికులతో కలిసి మ్యాప్ ను పరిశీలించారు. కూలీలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉప సర్పంచ్ రాఘవేందర్, పంచాయతీ కార్యదర్శి రమాదేవి, ఈసీ కృష్ణ, ఈజీఎస్ సిబ్బంది జంగయ్య, వార్డు సభ్యులు, నాయకులు తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్