రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని తుమ్మలూరు గ్రామంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన గ్రామసభలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ ఆరు గ్యారంటీ సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా చేరవేసే క్రమంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనే కోణంలో ఈ గ్రామసభ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి, జిల్లా అధికారులు, గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.