మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఏక్తా దివాస్ 2K రన్ కార్యక్రమం

269చూసినవారు
మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఏక్తా దివాస్ 2K రన్ కార్యక్రమం
రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం పరిధిలోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా 'రాష్ట్రీయ ఏక్తా దివాస్' 2K రన్ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లెలగూడ చందన చెరువు నుంచి బాలాపూర్ చౌరస్తా వరకు జరిగిన ఈ రన్‌ను ఇన్స్పెక్టర్ శంకర్ కుమార్ నాయక్ ప్రారంభించారు. దేశ సమైక్యతకు ప్రతీకగా నిలిచిన పటేల్ జయంతి సందర్భంగా జరుపుకునే ఈ దినోత్సవం ఐక్యత, దేశభక్తి, సేవా స్పూర్తిని బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్