హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఐటీ కంపెనీ నిరుద్యోగులను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. టెలికం నగర్‌లో ఒక సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ కంపెనీ పేరుతో కార్యాలయం నడుపుతున్న రాము అనే వ్యక్తి, నిరుద్యోగులకు శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పి ఒక్కొక్కరి నుంచి సుమారు రూ. 2 లక్షలు వసూలు చేశాడు. నాలుగు నెలలు పనిచేసినా జీతాలు ఇవ్వకపోవడంతో బాధితులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.