
విద్యార్థులకు శుభవార్త.. ఇంటర్ సప్లిమెంటరీలో ఇంప్రూవ్మెంట్
ఏపీలో ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఇంప్రూవ్మెంట్ రాసుకునేందుకు అవకాశం కల్పించారు. సబ్జెక్టుల వారీగా బెస్ట్ మార్క్స్ విధానాన్ని అమలు చేయనున్నారు. ప్రతి ఇంప్రూవ్మెంట్ పేపర్‌కు అదనంగా రూ.160 చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల 20వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.




