షాద్‌నగర్ పట్టణ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన పోలీస్ బాస్

263చూసినవారు
షాద్‌నగర్ పట్టణ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన పోలీస్ బాస్
ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని షాద్‌నగర్ టౌన్ పోలీస్ స్టేషన్‌ను పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి, ఐపీఎస్ మంగళవారం సందర్శించారు. స్టేషన్ పనితీరు, శాంతిభద్రతల నిర్వహణ, నేరాల దర్యాప్తు, నివారణ చర్యలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాలపై ఆయన సమగ్ర సమీక్ష నిర్వహించారు. స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసుల దర్యాప్తు, వినతిపత్రాల పరిష్కారం, నేర గణాంకాలు, శాఖాపరమైన కార్యక్రమాల అమలుపై కూడా సమీక్ష చేపట్టారు.

సంబంధిత పోస్ట్