రావిచేడ్‌లో గాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేక గ్రామసభ

1చూసినవారు
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం కడ్తాల్ లోని రావిచేడ్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం ప్రత్యేక గ్రామ సభను జిల్లా సర్పంచుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, రావిచేడ్ సర్పంచ్ బొప్పిడి గోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాల్ మాట్లాడుతూ, గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, గ్రామ అభివృద్ధికి, పరిశుభ్రతకు సహకరించాలని పిలుపునిచ్చారు. గ్రామంలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య నిర్వహణ, మంచినీటి సరఫరా వంటి అంశాలపై సభలో చర్చించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్