తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ప్రభుత్వం అందించిన పథకాలు, అభివృద్ధి పనులను వివరించడం కోసం గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు అధికారులు, మంత్రులు తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 12,760 గ్రామ పంచాయతీలలో 2,850 వార్డులలో గ్రామ సభలు జరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని తుమ్మలూరు గ్రామంలో నిర్వహించిన గ్రామసభ కార్యక్రమంలో రామకృష్ణారావుతో పాటు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి పాల్గొన్నారు. గ్రామ సభల్లో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించడమే ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు.