రాజకీయాలకు అతీతంగా రేషన్ కార్డులు ఇస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 3.39 కోట్ల మంది సన్నబియ్యం లబ్ధిదారులున్నారని అన్నారు. అర్హులందరికీ రేషన్ కార్డులను ఇస్తున్నామని, అది నిరంతరంగా కొనసాగుతుందన్నారు. రేషన్ కార్డుల కోసం ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని, దానికి ఎలాంటి గడువు ఉండదన్నారు. అధికారులు పరిశీలించి రేషన్ కార్డులు జారీ చేస్తారని పేర్కొన్నారు.