
మాజీ మేయర్ నీలగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనం
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ నీలగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు సోమవారం కుత్బుల్లాపూర్ లోని ప్రగతి నగర్ లో పార్టీ కార్యకర్తలు, అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నాయకులు ఆయనను శాలువతో సత్కరించి, మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోట్ల తిరుపతి, శరత్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.







































