మేడ్చల్ డివిజన్ పరిధిలోని ఇంద్రానగర్ కాలనీలో సోమవారం అర్ధరాత్రి ఇంటి ముందు పార్క్ చేసిన నర్సింగ్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని దొంగ చోరీ చేశాడు. ఈ ఘటన మొత్తం సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డైంది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ ఘటన హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి ప్రాంతంలో జరిగింది.