మేడ్చల్ - Medchal

సంక్రాంతి ముగ్గుల పోటీలు: కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో మహిళలకు ప్రోత్సాహం

సంక్రాంతి ముగ్గుల పోటీలు: కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో మహిళలకు ప్రోత్సాహం

మేడ్చల్ సర్కిల్ గుండ్లపోచంపల్లి 299 డివిజన్ లో సంక్రాంతి పండుగ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్, మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జంగిటి మమత ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ సాయిపేట శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఈ పోటీలు నిర్వహిస్తామని, మహిళలు ఎంతో ఇష్టపడే పండుగ సంక్రాంతి అని, ఈ పోటీలు వారిలోని కళను వెలికితీసే అవకాశమని తెలిపారు. ముగ్గుల పోటీలో మొదటి బహుమతి మౌనిక, ద్వితీయ బహుమతి శిరీష, తృతీయ బహుమతి భాగ్య గెలుచుకున్నారు. విజేతలకు గుండ్లపోచంపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్, మాజీ సర్పంచ్ బండారి నరేందర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.

వీడియోలు


హైదరాబాద్