మేడ్చల్ జిల్లా నాగారం పరిధిలోని ఎస్వీ నగర్‌లో శనివారం సాయంత్రం పట్టపగలే ఓ ఇంట్లోకి చొరబడి బంగారం దొంగిలించిన ఘటన చోటుచేసుకుంది. ప్రైవేట్ ఉద్యోగి రాహుల్ డ్యూటీకి వెళ్లగా, ఇంట్లో ఉన్న అతని భార్య బయటకు వెళ్లిన సమయంలో, ఉదయం నుంచి రెక్కి నిర్వహించిన ఓ మహిళ ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉన్న 15 తులాల బంగారం, వెండి, నగదు అపహరించింది. బయటకు వెళ్తుండగా, పైన పోర్షన్‌లో నివాసముండే ఇద్దరు పిల్లలు అనుమానాస్పదంగా ఆ మహిళను గుర్తించారు.