మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పరిధిలోని చౌదరిగూడలో వృత్తిపరమైన ఒత్తిడి, అనారోగ్యం కారణంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పరుచూరి మహేష్ (40) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ ఎస్ ఆర్ కండ్రిగకు చెందిన మహేష్, పోచారంలో నివాసం ఉంటూ హైటెక్ సిటీలో పనిచేస్తున్నాడు. నిన్న ఉద్యోగానికి వెళ్లి తిరిగి రాకపోవడంతో అతని భార్య నిరోషా పోచారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా చౌదరిగూడలోని సెటన్ హోటల్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకున్న మహేష్ మృతదేహం లభ్యమైంది.