కారుపై పడిన చెట్టు కొమ్మలు తొలగిస్తుండగా విషాదం

897చూసినవారు
కారుపై పడిన చెట్టు కొమ్మలు తొలగిస్తుండగా విషాదం
మేడ్చల్ జిల్లా అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టెలికాం కాలనీలో శుక్రవారం భారీ వర్షాల కారణంగా ఇంటి ముందు పార్క్ చేసిన కారుపై చెట్టు కొమ్మలు పడ్డాయి. వాటిని తొలగించే ప్రయత్నంలో, సమీపంలోని విద్యుత్ తీగలకు కొమ్మలు తగలడంతో విద్యుత్ ప్రవహించి, కారు యజమాని సందీప్ (44), ఆయన కుమార్తె రితిక (16) విద్యుత్ షాక్‌తో మృతిచెందారు. తల్లి పరిస్థితి విషమంగా ఉంది.

సంబంధిత పోస్ట్