
తెలుగు రాష్ట్రాల్లో 45 డిగ్రీల ఎండలు: ప్రజలు అల్లాడుతున్నారు
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్రమైన వేడి, ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. దీంతో బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం, నిన్నటి ద్రోణి/గాలి అంతరాయం ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమొరిన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోంది.

























