
వందేమాతరం గీతానికి 150 ఏళ్లు: ప్రత్యేక ఆలాపనతో స్ఫూర్తి నింపిన పాఠశాల
వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కుల్కచర్ల మండలం ముజహీద్ పూర్ తెలంగాణ మోడల్ స్కూల్ లో ప్రత్యేక ఆలాపన కార్యక్రమం నిర్వహించారు. స్వాతంత్రోద్యమ సమయంలో భారతీయులను ఏకతాటిపైకి తెచ్చిన ఈ గీతం దేశభక్తి స్ఫూర్తిని నేటికీ రగిలిస్తోందని ప్రిన్సిపల్ జ్యోతి హెప్సిబా అన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు సమూహంగా దేశభక్తితో కూడిన వాతావరణాన్ని సృష్టించారు. విద్యార్థులు వందేమాతరం నినాదాలతో పాఠశాలను హోరెత్తించారు.
































