
వికారాబాద్: 11వ జోనల్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం
వికారాబాద్ పరిధి శివారెడ్డిపేటలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో ఈరోజు 11వ జోనల్ స్పోర్ట్స్ మీట్‌ను డీసీఓ సాయిలత ప్రారంభించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమె అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ క్రీడా పోటీలలో కళాశాల ప్రిన్సిపల్ రమాదేవి, డాక్టర్ నిఖిల్ తో పాటు పలువురు పాల్గొన్నారు.
































