
లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ లో అనారోగ్యంతో బాధపడుతున్న కొండా సుజాత, ఎరగాంధండ్ల వంశీ, రెడ్డి సత్యనారాయణ, నీరుడు ఓంప్రకాష్, మర్గం శంకర్, కొట్టె సులోచనలకు సీఎం సహాయ నిధి కింద మూడు లక్షల రూపాయల చెక్కులను కెకెఎం ట్రస్ట్ చైర్మన్, కాంటెస్టెడ్ కార్పొరేటర్ కూన శ్రీనివాస్ గౌడ్ తన నివాసం వద్ద పంపిణీ చేశారు. గతంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ నిధి కోసం దరఖాస్తు చేసుకున్నారు.





































