శంకర్పల్లి: స్విమ్మింగ్ పూల్లో మునిగి విద్యార్థి మృతి

66చూసినవారు
శంకర్పల్లి: స్విమ్మింగ్ పూల్లో మునిగి విద్యార్థి మృతి
విహారయాత్రకు వచ్చిన ఓ విద్యార్థి స్విమ్మింగ్ పూల్లో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీట మునిగిన ఘటన శంకర్పల్లి పిఎస్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. హైదరాబాద్ పాతబస్తీలోని శాలిబండ సమీపంలో గల ఓ హై స్కూల్కు చెందిన 60 మంది విద్యార్థులు, టీచర్లు వైల్డ్ వాటర్ రిసార్ట్కు వెళ్లారు. ఫైజాన్ అన్సారి అనే 6వ తరగతి విద్యార్థి స్విమ్ చేస్తుండగా నీటిలో మునిగి మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.