
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు.. మిలియన్ డాలర్లు డిమాండ్!
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. తాజాగా, యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్లే విమానంలో బాంబు పెట్టామని, తక్షణమే మిలియన్ డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఒక వ్యక్తి నుంచి ఎయిర్‌పోర్టు అధికారులకు మెయిల్ వచ్చింది. భద్రతా సిబ్బంది విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా, ఎటువంటి ముప్పు లేదని నిర్ధారించారు. ప్రాథమిక విచారణలో మెయిల్ పంపిన వ్యక్తి యూఎస్‌కు చెందిన జాస్పర్ అని గుర్తించారు. ఈ ఏడాది శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు 20కి పైగా బెదిరింపు కాల్స్, మెయిల్స్ వచ్చినట్లు డీసీపీ రాజేశ్ తెలిపారు. గతంలో కూడా లుఫ్తాన్సా, బ్రిటిష్ ఎయిర్‌వేస్, ఎయిర్ ఇండియా విమానాలకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి.







































