శుభకార్యానికి వచ్చి తిరుగు ప్రయాణమైన ఓ కుటుంబాన్ని అపార్ట్‌మెంట్ లిఫ్ట్ నిర్లక్ష్యం విషాదంలోకి నెట్టింది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సన్ సిటీ సమీపంలోని మూన్ రాక్ అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. షామీర్‌పేట్‌కు చెందిన లక్ష్మమ్మ (60) లిఫ్ట్ డోర్ తెరిచి ఉండటంతో లిఫ్ట్ వచ్చిందనుకుని అడుగు వేయగా, లిఫ్ట్ గుంతలోకి జారి పడి మృతి చెందింది. ప్రాథమిక దర్యాప్తులో లిఫ్ట్ మెయింటెనెన్స్ లేకపోవడం, సెన్సార్ వ్యవస్థలు పనిచేయకపోవడం కారణాలుగా తేలాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.