తల్లిపాలే శిశువుకు ఉత్తమ పోషకాహారం.. పద్మజ

0చూసినవారు
తల్లిపాలే శిశువుకు ఉత్తమ పోషకాహారం.. పద్మజ
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అత్తాపూర్ సర్కిల్ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ రామకృష్ణ మఠం కమిటీ హాల్లో బుధవారం అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మజ మాట్లాడుతూ తొలి ఆరు నెలలు శిశువుకు తల్లిపాలే సంపూర్ణ ఆహారమని, ప్రతి తల్లి తప్పనిసరిగా తల్లిపాలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఎల్‌ఓ సూపర్వైజర్ సాంబరాజు, ఏఎన్‌ఎం జాబేదా, ఆశా వర్కర్ మీనా, అంగన్వాడీ టీచర్లు కుడికాల రాజేశ్వరి, వెంకటేశ్వరమ్మ, సునీత, ఆర్‌పీలు భారతి, సునీత, గర్భిణీలు, బాలింతలు, తల్లులు పాల్గొన్నారు. తల్లిపాలే శిశువుకు ఉత్తమ పోషకాహారం అని పద్మజ తెలిపారు.

సంబంధిత పోస్ట్