సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, ట్రాఫిక్ నియంత్రణపై పోలీసు అధికారులకు డీజీపీ సీవీ ఆనంద్ దిశానిర్దేశం చేశారు. ఢిల్లీ పర్యటన నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో సీఎం కాన్వాయ్ వెళ్లే వరకు వాహనాలను నిలిపివేయడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఈ విషయంపై స్పందించిన సీఎం, తన పర్యటనల నేపథ్యంలో వాహనదారులు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. ఈ మేరకు డీజీపీ పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.