లక్ష్యం ఉంటే దూరం అడ్డంకి కాదు: రమేష్ రెడ్డి

2చూసినవారు
లక్ష్యం ఉంటే దూరం అడ్డంకి కాదు: రమేష్ రెడ్డి
హైదరాబాద్‌లోని బాబుల్ రెడ్డి నగర్ నుంచి తిరుపతి వరకు చేపట్టిన మహా సైకిల్ యాత్రను రమేష్ రెడ్డి విజయవంతంగా పూర్తి చేశారు. ఈ నెల 6న తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్యం ఉంటే ఏ సవాలునైనా అధిగమించవచ్చని, యువత ఆరోగ్యంపై దృష్టి సారించి సైక్లింగ్ వంటి మంచి అలవాట్లు అలవరచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం స్వామివారి ఆశీస్సులతో హైదరాబాద్‌కు బయలుదేరారు.