
రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది: రామ్మెహన్ నాయుడు
రాజ్యసభలో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లును కేంద్రమంత్రి నిత్యానందరాయ్ ప్రవేశపెట్టారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి రామ్మెహన్ నాయుడు, విభజన తర్వాత ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మారిందని, విభజన తీరుకు తాము వ్యతిరేకమని అన్నారు. ప్రజా రాజధాని అమరావతి చరిత్రలో నిలిచిపోతుందని, 2019-2024 మధ్య ఏపీకి చీకటి రోజులు అని, అప్పటి ప్రభుత్వం అమరావతిని నాశనం చేసి, మూడు రాజధానుల పేరుతో గందరగోళం సృష్టించిందని విమర్శించారు. ఐదేళ్లపాటు అమరావతి రైతులను వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు.




