తెలంగాణ పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు ఏర్వ సత్యనారాయణ, రాపోలు సత్యయ్యలు కొండా లక్ష్మణ్ బాపూజీని నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, దేశ స్వాతంత్ర్యం కోసం, తెలంగాణ సాధన కోసం పోరాడిన మహా యోధుడిగా కొనియాడారు. రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ లోని భావన ఋషి నగర్ శ్రీ మార్కండేయ పద్మశాలి ట్రస్ట్ భవనంలో బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి సోమవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ సమాజ సేవకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కాశీ యాదగిరి, కొంపల్లి జగదీష్, సామల యాదయ్య, బండారి యాదగిరి, ఏర్వ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయమని వారు పేర్కొన్నారు.