
ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి!
TG: రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్ పరిధిలో ఉన్న హిమాయత్ సాగర్ జలాశయం వద్ద చేపలు పట్టడానికి వెళ్లి సరదాగా ఈత కొట్టేందుకు నీటిలోకి దిగిన ముగ్గురు స్నేహితులలో ఇద్దరు యువకులు నీటిలో మునిగి మరణించారు. మృతులను టోలీచౌకి ప్రాంతానికి చెందిన షేక్ సల్మాన్, షాబాజ్లుగా పోలీసులు గుర్తించారు. వీరితో పాటు వెళ్లిన మరో యువకుడు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు మృతదేహాలను వెలికితీసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.




