రాజేంద్రనగర్: న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ప్రత్యేక ఫోకస్

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలో గల పబ్‌లు, బార్‌లు, రెస్టారెంట్స్‌పై శనివారం స్థానిక పోలీసులు ప్రత్యేక ఫోకస్ తో తనిఖీ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. వేడుకల పేరుతో డ్రగ్స్ వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని యజమానులకు సూచించారు. నిబంధనలను ఉల్లంఘించినచో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
