ఓం జైభవానీ 11 కేవీ ఫీడర్ ఫరిధిలో కొత్త లైన్ ఏబీస్విచ్ల ఏర్పాటు కారణంగా శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని పెద్దషాపూర్ ఏఈ ఎ. సురేష్ రెడ్డి తెలిపారు. తొండుపల్లి, కిషన్ గూడ, ఊట్పల్లి గ్రామాల పరిధిలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ ఉండదని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు విద్యుత్ సిబ్బందకి సహకరించాలని కోరారు.