రంగారెడ్డి: మిత్రులతో మాట్లాడుతూ.. కుప్పకూలిన యువకుడు

0చూసినవారు
రంగారెడ్డి: మిత్రులతో మాట్లాడుతూ.. కుప్పకూలిన యువకుడు
శుక్రవారం రాత్రి కడ్తాల్‌లో పోతగళ్ల మహేశ్ (27) అనే యువకుడు స్నేహితులతో మాట్లాడుతుండగా అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు. వ్యవసాయం చేసుకునే మహేశ్, తన ఇంటి సమీపంలో స్నేహితులతో సంభాషిస్తున్న సమయంలో ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పి పడిపోయాడు. వెంటనే అతన్ని స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి, ఆపై తుక్కుగూడలోని మరో ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. తండ్రి పెంటయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్