రంగారెడ్డి: ఉరేసుకుని యువకుడి బలవన్మరణం

0చూసినవారు
రంగారెడ్డి: ఉరేసుకుని యువకుడి బలవన్మరణం
శంషాబాద్ మున్సిపల్ పరిధిలో శనివారం మనస్తాపంతో ఓ యువకుడు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వనపర్తి జిల్లా పెబ్బేర్కు చెందిన పి.మహేశ్(27) ఉపాధి కోసం పాలమాకులకు వచ్చి దినసరి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మరో మహిళతో చనువుగా ఉంటున్న విషయంపై ఇటీవల పెబ్బేర్ ఠాణాలో కేసు నమోదవడంతో మనస్తాపం చెంది, తొండుపల్లి సమీపంలో చెట్టుకు ఉరేసుకున్నాడు. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా శవాగారానికి తరలించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.