మైలార్ దేవ్ పల్లిలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పల్లె చెరువు వద్ద ఆర్టీసీ బస్సును కూరగాయల ఆటో ఢీ కొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఆటో డ్రైవర్ లింగస్వామి, వెంకన్న లకు తీవ్ర గాయాలు అయ్యాయి. హుటాహుటిన మలక్ పేట్ లోని యశోద ఆసుపత్రికి తరలించారు. శంషాబాద్ మార్కెట్ నుండి కూరగాయలు తీసుకొని చంద్రాయణ్ గుట్టా వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.