శంషాబాద్ సర్కిల్ పరిధిలో శనివారం బాహ్య వలయ రహదారిపై రెండు కార్లు ఢీకొన్న సంఘటనలో నలుగురు గాయపడ్డారు. శేరిలింగంపల్లికి చెందిన సయ్యద్ అలీ తన జన్మదిన వేడుకలు ముగించుకుని భార్య, బావ, మరదళ్లతో కలిసి ఇంటికి తిరిగి వెళ్తుండగా, చిన్నగోల్కొండ సమీపంలో మద్యం మత్తులో ఉన్న అమిత్ అనే వ్యక్తి నడుపుతున్న కారు వెనుక నుంచి వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో గాయపడిన నలుగురిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో కారు నడిపి ప్రమాదానికి కారణమైన బంజారాహిల్స్‌కు చెందిన అమిత్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.