కేటీఆర్ నివాసంలో బీఆర్ఎస్ కీలక నేతల రాజకీయ భేటీ

645చూసినవారు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసంలో పార్టీ కీలక నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీలో హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి వంటి ప్రముఖులు పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై వీరు చర్చించారు. అనంతరం కొత్వాల్‌గూడలోని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి క్వారీ వద్దకు వెళ్లనున్నట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ నివాసానికి పోలీసులు భారీగా చేరుకోవడంతో ఉత్కంఠ నెలకొంది.

సంబంధిత పోస్ట్