రైలు నుంచి పడి ఒకరు మృతి చెందిన ఘటన మంగళవారం మేడ్చల్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ సాయీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ మృతుడు మహబూబాబాద్ జిల్లాకు చెందిన మలోతు దేవేందర్ (30)గా గుర్తించినట్లు తెలిపారు. మృతుడు కాచిగూడకు వెళ్లాల్సి ఉండగా రాయలసీమ ఎక్స్ ప్రెస్ ఎక్కి మేడ్చల్ రైల్వే స్టేషన్ వద్ద దిగబోతుండగా ప్రమాదవశాత్తు అదే రైలు కింద పడి మృతి చెందినట్లు పేర్కొన్నారు.