సికింద్రాబాద్ - Secunderabad

నారాయణగూడలో గంజాయి పట్టివేత

నారాయణగూడలో గంజాయి పట్టివేత

నారాయణగూడ మెట్రో స్టేషన్ సమీపంలో ఎస్టీఎఫ్ డీ టీం పోలీసులు గంజాయి అక్రమ విక్రయాలపై దాడులు నిర్వహించి 2.6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. టైమ్ ఇన్‌స్టిట్యూట్‌కు ఎదురుగా గంజాయి అమ్మకాలు జరుపుతున్న షేక్ ముసాఫర్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. సుల్తాన్ బజార్ నుంచి నారాయణగూడ రోడ్డుపై తనిఖీలు చేపడుతున్న సమయంలో నిందితుడు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 2.6 కేజీల గంజాయి, ఒక బైక్, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో ఎస్టీఎఫ్ డీ టీం సీఐ నాగరాజు ఆధ్వర్యంలో సిబ్బంది పాల్గొన్నారు.

హైదరాబాద్