సికింద్రాబాద్ - Secunderabad

నారాయణగూడలో గంజాయి పట్టివేత

నారాయణగూడలో గంజాయి పట్టివేత

నారాయణగూడ మెట్రో స్టేషన్ సమీపంలో ఎస్టీఎఫ్ డీ టీం పోలీసులు గంజాయి అక్రమ విక్రయాలపై దాడులు నిర్వహించి 2.6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. టైమ్ ఇన్‌స్టిట్యూట్‌కు ఎదురుగా గంజాయి అమ్మకాలు జరుపుతున్న షేక్ ముసాఫర్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. సుల్తాన్ బజార్ నుంచి నారాయణగూడ రోడ్డుపై తనిఖీలు చేపడుతున్న సమయంలో నిందితుడు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 2.6 కేజీల గంజాయి, ఒక బైక్, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో ఎస్టీఎఫ్ డీ టీం సీఐ నాగరాజు ఆధ్వర్యంలో సిబ్బంది పాల్గొన్నారు.

వీడియోలు


హైదరాబాద్
వెండి ధరలు సగానికి తగ్గే అవకాశం: నిపుణుల అంచనా!
Jan 12, 2026, 12:01 IST/

వెండి ధరలు సగానికి తగ్గే అవకాశం: నిపుణుల అంచనా!

Jan 12, 2026, 12:01 IST
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో వెండి ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం, రాబోయే 3 నెలల్లో వెండి ధరలు ఏకంగా సగానికి తగ్గే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలో వెండి ధర ఔన్సుకు 80 డాలర్ల స్థాయిని నిలబెట్టుకోవడంలో విఫలమైంది. డాలర్ బలోపేతం, పెట్టుబడిదారుల అప్రమత్తత వెండి ధరలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. టీడీ సెక్యూరిటీస్‌లో సీనియర్ కమోడిటీ స్ట్రాటజిస్ట్ డేనియల్ గల్లీ, మార్చి వెండి ఫ్యూచర్స్ ధరలను విశ్లేషిస్తూ.. దీర్ఘకాలంలో వెండి ధర రూ.40 స్థాయికి పడిపోవచ్చని అంచనా వేశారు.