సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

188చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై తాను ఎప్పుడూ ప్రతికూలంగా ఆలోచించలేదని, ఆయన తనకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని, శత్రువు కాదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉంటేనే రాజకీయంగా ఎదుర్కోవడం సులభమవుతుందని, విశ్రాంతి తీసుకుంటున్న ప్రజా ప్రతినిధి గురించి చెడు కోరుకోవడం తన స్వభావం కాదని తెలిపారు. కేసీఆర్‌కు గాయమైనప్పుడు ఆస్పత్రికి వెళ్లి పరామర్శించానని, అసెంబ్లీలోనూ ఆయనను కలిసి యోగక్షేమాలు అడిగానని, రాజకీయ విభేదాలున్నా వ్యక్తిగతంగా గౌరవం ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్