ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, బీఆర్ఎస్ రాజకీయ నాటకంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బలయ్యారని అన్నారు. ఇటీవల కాలంలో బీఆర్ఎస్ నాయకులు వాడుతున్న భాష, వివాదాస్పద వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, బీఆర్ఎస్ అగ్రనాయకత్వం అనుసరిస్తున్న రాజకీయ శైలి, అణచివేత ధోరణిపై నిప్పులు చెరిగారు.