ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


ఇరాన్ పై భూతల దాడులకు అమెరికా సిద్ధం?
Mar 29, 2026, 09:03 IST/

ఇరాన్ పై భూతల దాడులకు అమెరికా సిద్ధం?

Mar 29, 2026, 09:03 IST
ఇరాన్-అమెరికా యుద్ధం ప్రారంభమై నెల దాటింది. పశ్చిమాసియా సంక్షోభం కొనసాగుతుండగా, అమెరికా దాడులను ముమ్మరం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు క్షేత్రస్థాయిలో భూతల దాడులకు సిద్ధమవుతున్నాయని వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. ఇరాన్ ఆయువుపట్టుగా ఉన్న ఖార్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం, అక్కడి చమురు టెర్మినల్ ద్వారా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం, హార్ముజ్ జలసంధిలో అడ్డంకులను తొలగించడం, ఎన్‌రిచ్డ్ యురేనియాన్ని స్వాధీనం చేసుకోవడం అమెరికా ప్రణాళికలుగా తెలుస్తోంది. వేల సంఖ్యలో యూఎస్ బలగాలను మధ్యప్రాచ్యంలో మోహరించారు.