సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో దొంగిలించబడిన సుమారు రూ. 3.20 కోట్ల విలువైన 1061 సెల్‌ఫోన్లను శుక్రవారం సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ ముత్యంరెడ్డి బాధితులకు అప్పగించారు. ఈ స్వాధీనంలో ఐఫోన్‌లతో పాటు అనేక విలువైన మొబైల్ ఫోన్లు ఉన్నాయి. కొందరి ఫోన్లు సంవత్సరం తర్వాత దొరకగా, మరికొన్ని 15 రోజులలోనే రికవరీ కావడం విశేషం. తమ పోగొట్టుకున్న ఫోన్లు తిరిగి పొందిన బాధితులు ఆనందం వ్యక్తం చేశారు.