
ట్రంప్ పేరుతో నకిలీ ఆధార్: ఎమ్మెల్యేపై కేసు నమోదు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరుతో నకిలీ ఆధార్ కార్డు సృష్టించిన ఆరోపణలపై శరద్ పవార్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రోహిత్ పవార్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇటీవల ఒక విలేకరుల సమావేశంలో, రూ.20 కంటే తక్కువకే నకిలీ ఆధార్‌ను పొందవచ్చని చూపించడానికి ట్రంప్ పేరు, ఫోటోతో ఆధార్ కార్డును ప్రదర్శించారు. నకిలీ గుర్తింపు కార్డులతో మహారాష్ట్ర ఓటర్ల జాబితాలో నమోదయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని హెచ్చరించారు. అయితే బీజేపీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.




